బాలికల జువెనల్ హోం నుంచి యువతి పరార్

by  |
young woman escaped
X

దిశ, వెబ్‌డెస్క్ : జువెనల్ హోంలో ఉన్న యువతి అర్ధరాత్రి సిబ్బంది కళ్లుగప్పి పరారీ అయింది. ఈ ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నింబోలి అడ్డ బాలికల జువెనల్ హోంలో మంగళవారం తెల్లవారు జామున వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన యూసుఫ్ కుమార్తె (18) ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆమె చుట్టు పక్కల వాతావరణ ప్రభావమో లేక ఇతర కారణమో తెలియదు కానీ.. పలు నేరాల్లో అనుమానితురాలిగా ముద్ర వేసుకుంది. పలు నేరాల్లో సస్పెక్ట్‌ అని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల రోజుల క్రితమే నింబోలి అడ్డలోని బాలికల జువెనల్ హోమ్‌లో చేర్పించారు. అయితే, అప్పటి నుంచే అక్కడి నుంచి తప్పించుకోవాలని పథకం వేసుకున్న సదరు యువతి అవకాశం కోసం ఎదురుచూడసాగింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తెల్లవారుజామున ప్రధాన గేటు తాళాన్ని దొంగిలించి అక్కడి నుంచి పరారీ అయింది. ఉదయాన్నే సిబ్బంది గమనించగా యువతి కనిపించలేదు.. దీనికి తోడు ప్రధాన గేటు తాళం కూడా లేకపోవడంతో.. స్థానిక కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story