- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదేళ్లుగా ప్రేమ.. పెళ్లి మండపంలో వధువుకు అలా షాకిచ్చిన వరుడు
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఐదేళ్లుగా ఓ యువతిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యి చివరకు యువతికి షాకిచ్చాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళ్లితే.. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన దాసరి అనిల్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వీరి ప్రేమ మారింది. దీంతో అమ్మాయికి వేరే సంబంధాలు చూడటం మొదలు పెట్టడంతో ఇద్దరూ ఇరు కుటుంబాలతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. పెద్దవారు కూడా […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఐదేళ్లుగా ఓ యువతిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యి చివరకు యువతికి షాకిచ్చాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళ్లితే.. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన దాసరి అనిల్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వీరి ప్రేమ మారింది. దీంతో అమ్మాయికి వేరే సంబంధాలు చూడటం మొదలు పెట్టడంతో ఇద్దరూ ఇరు కుటుంబాలతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. పెద్దవారు కూడా ఒప్పుకోవడంతో పెళ్లికి సిద్ధమయ్యారు.
దీంతో ఇరు కుటుంబ సభ్యులు ఎంగేజ్ మెంట్ చేసి.. గురువారం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ముహూర్తానికి సరిగ్గా రెండు గంటల ముందు ఉదయం 9 గంటలనుండి అనిల్ కనిపించకుండా పోయాడు. అనిల్ కోసం ఎంత వెతికినా ఎలాంటి సమాచారం తెలియలేదు. స్నేహితులు కూడా అనిల్ గురించి తెలియదు అని చెప్పడంతో.. అనిల్ మోసం చేసి పారిపోయాడని యువతి, యువతి కుటుంబసభ్యులు గ్రహించారు. ఇక ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






