కొన్ని రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే దారుణం

241

దిశ, చిట్యాల : మరో పదిహేను రోజుల్లో పెళ్లి. కానీ ఇంతలోనే ఆ యువకుడికి కరోనా మహమ్మారి సోకింది. దీంతో నాలుగు రోజుల్లోనే మృత్యువు ఒడిలోకి చేరాడు. వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన యువకుడు డబ్బాల రాజేష్(24)కు నాలుగు రోజుల క్రితం కరోనా సోకింది. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉంటూ మెడిసిన్ వాడుతున్నాడు. ఇంతలోనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. ఈ క్రమంలోనే రాజేష్ ఈరోజు మృతి చెందాడు. ఇటివలే పెద్దలు యువకుడికి పెళ్లి కూడా నిశ్చయించారు. మరో 15 రోజుల్లో పెళ్లి ఇంతలోనే కరోనా మహమ్మారి సోకి అతడు మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..