ఆ కుటుంబానికే వైసీపీ తిరుపతి టికెట్

by  |
ఆ కుటుంబానికే వైసీపీ తిరుపతి టికెట్
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి ఉప ఎన్నికల బరిలో దుర్గా ప్రసాద్​కుటుంబం నుంచి ఒకరిని బరిలోకి దించితే బావుంటుందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సీఎంతో మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, బొత్సా, అనిల్​భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించారు. దూకుడుగా వెళ్తున్న బీజేపీ తిరుపతిలో పోటీకి సిద్ధపడినా, టీడీపీ అభ్యర్థిపై సునాయాసంగా గెలుస్తామనే భావనకొచ్చారు. ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకతా లేదని చెప్పారు. ఇంకా ఇంటి పట్టాలు రాకుండా ఇన్నాళ్లూ టీడీపీ అడ్డుపడిందనే అంశం జనంలోకి బాగా వెళ్లినట్లు మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇస్తున్నందున ఇబ్బంది లేదని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్​ఈసీ నిమ్మగడ్డ వ్యవహారంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. అంతేగాకుండా కరోనా సెకండ్​వేవ్ కొనసాగుతున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదనే నిర్ణయానికి కూడా వచ్చారు. పంచాయతీ ఎన్నికలు, మంత్రుల వ్యాఖ్యలపై ఎస్​ఈసీ గవర్నర్​కు ఫిర్యాదు చేసిన సందర్భంలో గవర్నర్​ స్పందనను బట్టి ముందుకెళ్లాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్​విగ్రహం ఏర్పాటు గురించి మంత్రి అనిల్​ ప్రస్తావించగా ముందుగా ప్రాజెక్టు ద్వారా నీళ్లిచ్చాక చూద్దామని సీఎం చెప్పినట్లు సమాచారం.

Next Story