- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచానికి ఆర్థిక మాంద్యం తప్పదు
<p>కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఆర్థిక మాంద్యం బారినపడేస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది సుమారు 5.8 లక్షల కోట్ల నుంచి 8.8 లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారు 440.8 లక్షల కోట్ల రూపాయల నుంచి 668.8 లక్షల కోట్ల రూపాయల వరకు నష్టపోయే అవకాశముందని ఏడీబీ చెబుతోంది. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 6.4 నుంచి 9.7 శాతానికి సమానం కావడం విశేషం. ఇక […]</p>

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఆర్థిక మాంద్యం బారినపడేస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేస్తోంది. కరోనా కారణంగా ఈ ఏడాది సుమారు 5.8 లక్షల కోట్ల నుంచి 8.8 లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారు 440.8 లక్షల కోట్ల రూపాయల నుంచి 668.8 లక్షల కోట్ల రూపాయల వరకు నష్టపోయే అవకాశముందని ఏడీబీ చెబుతోంది.
ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 6.4 నుంచి 9.7 శాతానికి సమానం కావడం విశేషం. ఇక దక్షిణాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు కంపించిపోతాయని ఏడీబీ అభిప్రాయపడింది. ఈ ఏడాది దక్షిణాసియా దేశాల జీడీపీ 3.9 శాతం నుంచి 6 శాతం వరకు అంటే సుమారు 14,200 కోట్ల డాలర్ల నుంచి 21,800 కోట్ల డాలర్లు భారత కరెన్సీలో ఇంచుమించు 10.79 లక్షల కోట్ల రూపాయల నుంచి 16.56 లక్షల కోట్ల రూపాయలు పడిపోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
దీంతో కోట్ల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పింది. ఒకవేళ ఉద్యోగాలు ఉన్నప్పటికీ జీతాల్లో కోత పడుతుందని, కొత్త ఉద్యోగాల్లో వేతనాలు తగ్గిపోతాయని అభిప్రాయపడింది. ఈ తగ్గుదల 1.2 లక్షల కోట్ల డాలర్ల నుంచి 1.8 లక్షల కోట్ల డాలర్ల వరకు ఉండొచ్చని ఏడీబీ పేర్కొంది. ఆసియా దేశాల్లో కార్మికుల వేతనాలు 30 శాతం వరకు తగ్గిపోయే ప్రమాదముందని హెచ్చరించింది.






