- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్నేహితురాలి ఇంటిలో చిక్కుకున్న యువతి.. చివరికి ఇంటికి చేరింది
<p>దిశ, మెదక్: లాక్‌డౌన్ కారణంగా పొరుగు రాష్ట్రంలో చిక్కుకుపోయిన ఓ యువతి సోమవారం ఇంటికి చేరుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన ఆశా కార్యకర్త అమృత పెద్ద కుమార్తె స్వాతి రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌లోని భగవంత్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతోంది. మార్చిలో సెలవులకు ఇంటికి వచ్చిన స్వాతి స్నేహితురాలిని చూడడానికి కడప జిల్లా రాజంపేట వెళ్ళింది. అయితే, అక్కడ ఉండగానే లాక్‌డౌన్ ప్రకటన వెల్లడైంది. కళాశాలకు సైతం సెలవులు ప్రకటించినట్లు స్నేహితుల ద్వారా స్వాతి తెలుసుకుంది. […]</p>
దిశ, మెదక్: లాక్‌డౌన్ కారణంగా పొరుగు రాష్ట్రంలో చిక్కుకుపోయిన ఓ యువతి సోమవారం ఇంటికి చేరుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన ఆశా కార్యకర్త అమృత పెద్ద కుమార్తె స్వాతి రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌లోని భగవంత్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతోంది. మార్చిలో సెలవులకు ఇంటికి వచ్చిన స్వాతి స్నేహితురాలిని చూడడానికి కడప జిల్లా రాజంపేట వెళ్ళింది. అయితే, అక్కడ ఉండగానే లాక్‌డౌన్ ప్రకటన వెల్లడైంది. కళాశాలకు సైతం సెలవులు ప్రకటించినట్లు స్నేహితుల ద్వారా స్వాతి తెలుసుకుంది. ఇంటికి వెళ్లిపోదామని అనుకునేలోపే రవాణా సదుపాయాలు రద్దు కావడంతో 28 రోజులపాటు రాజంపేటలోని స్నేహితురాలి ఇంట్లో ఉండిపోయింది. చివరకు మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకుని రవాణా సదుపాయం కల్పించడంతో స్వగ్రామం సిద్దిపేటకు
క్షేమంగా చేరుకుంది.
tag: lockdown, student, harish rao, home, siddipet






