ఆర్ఎంపీల సేవలు అమోఘం.. కరోనా గడ్డు కాలంలో అండగా

by  |
ఆర్ఎంపీల సేవలు అమోఘం.. కరోనా గడ్డు కాలంలో అండగా
X

దిశ, ముధోల్: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉంటూ వారికి ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడుతున్న ఆర్.ఎం.పి, పీ ఎం పీ ల సేవలు అమోఘం. ముధోల్ నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో దాదాపు ఐదు వందల ఇరవై మంది ఆర్.ఎం.పి, పి.ఎం.పిలు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. నియోజక వర్గంలోని ముధోల్, తానూరు, కుభీర్, బైoసా, లోకేశ్వరం, బాసర, కుంటాల మండలాల్లో ఆర్.ఎం.పి, పి.ఎం.పి ప్రజలకు సేవలు అందిస్తున్నారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ప్రథమ చికిత్స అందించి తదుపరి ఆరోగ్య చికిత్స కొరకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలకు పంపించుతున్నారు. రాత్రి సమయంలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో పాటు వారి వెంట వుంటూ చికిత్స అందే వరకు ఉంటున్నారు. దీంతో ప్రజలు సంహిత గ్రామీణ వైద్యులకు ఎంతో ఆదరాభిమానాలతో చూస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన ఆధునిక చికిత్స విధానంపై సంహిత ఆర్.ఎం.పి, పి.ఎం.పి లకు వారి సంఘం తరఫున అవగాహన సదస్సులు కూడా నిర్వహించుతున్నారు.

పలు సామాజిక కార్యక్రమాలలో ఆర్ఎంపీల పాత్ర..

గ్రామీణ వైద్యులు ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందించడమే కాకుండా పలు సామాజిక సేవా కార్యక్రమంలో సహితం పాల్గొంటున్నారు. వేసవిలో తమ తమ మండలాలలో అర్ఎంపీలు చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రజలకు చల్లని నీళ్ళు ఇచ్చి దాహం తీరుస్తున్నారు. అలాగే ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులకు డాక్టర్స్ డే సందర్భంగా పండ్లు పంపిణీ చేయడం, వృద్దులకు జ్యూసులు అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే గ్రామాల్లో డాక్టర్ల చే ఆరోగ్య వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక వైద్య సేవలు అందించడంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి స్థానికంగానే నిపుణులతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. దీంతో ప్రజలకు నిరుపేదలకు తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు..

గ్రామీణ వైద్యులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా భాగస్వాములవుతున్నారు. ముఖ్యంగా మట్టి వినాయకుల తయారీపై అవగాహన కార్యక్రమాలు కల్పించి, మట్టి విగ్రహాలను అందిస్తున్నారు. కళాశాల, పాఠశాలలో ఉత్సవాల నిర్వహణ సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

కరోనా గడ్డు కాలంలో తమ వంతు సహాయంగా..

కరోనా కష్టకాలంలో ప్రజలకు తమ తమ మండలాలలోని ఆరోగ్య ఆర్ఎంపీలు, పీఎంపీలు తగు సేవలు నిర్వహించారు. ప్రజలకు కరోనా వ్యాధి, వైరస్ ల గురించి అవగాహన కల్పించారు. లాక్ డౌన్ లో ప్రజలు ఇంటిలోనే నిర్బంధమైన సమయంలో ప్రజలకు వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలపై తగు ప్రథమ చికిత్సలు అందించారు. అదేవిధంగా కరోనా సమయంలో కరోనా రాకుండా ప్రజల్లో ఏవిధంగా నియమాలు పాటించాలి, అన్న విషయాలపై అవగాహన కల్పించారు.

ప్రభుత్వం మా సేవలను గుర్తించి సహకారం అందించాలి.

గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆర్.ఎం.పి, పి.ఎం.పి లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందించాలి, గతంలో ఆర్.ఎం.పి, పి.ఎం.పి లకు డివిజన్ కేంద్రంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతులకు హాజరుకాని ఆర్.ఎం.పి, పి.ఎం.పి లకు మళ్లీ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి అని తమ సమస్యలను స్థానిక శాసనసభ్యులు విట్టల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లి సమస్యలను తీర్చడానికి సహకరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. శిక్షణ పూర్తయిన ఆర్.ఎం.పి, పి.ఎం.పి లకు ప్రభుత్వం తగిన ఆర్ధిక సహాయం అందించాలని కోరారు. -డివిజన్ అధ్యక్షులు ఆశమోల్ల మోహన్ .ఆర్.ఎం.పి, పి.ఎం.పి ల డివిజన్ అధ్యక్షుడు.

ప్రజలకు ప్రథమ చికిత్స చేయడం లోనే ఆనందం..

తమ వద్దకు వచ్చే ప్రజలకు ప్రథమ చికిత్స చేయడంతో పాటు పలు వ్యాధులతో బాధపడుతున్న గ్రామస్తులకు ఉన్నత వైద్యం కోసం పట్టణాలను తీసుకెళ్లి తమకు ఉన్న పరిచయాలతో తక్కువ డబ్బు లోనే తగు చికిత్స చేయించి వాళ్లను పూర్తి ఆరోగ్యవంతులుగా చేయడంలొనే ఆనందం వుంది -తుకారాం మటేగాం ఆర్ఎంపీ


Next Story

Most Viewed