తండావాసులను బహిష్కరించిన సర్పంచ్.. చివరికి ఏం జరిగిందంటే ?

by Sridhar Babu |   (  Updated:2021-12-13 20:08:09  IST  )

<p>దిశ, కామారెడ్డి : తండాకు చెందిన 40 కుటుంబాలను సర్పంచ్ బహిష్కరించారని ఆరోపిస్తూ తండా వాసులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ తండాకు చెందిన 40 కుటుంబాలు కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన సర్పంచ్ దశరథ్ నాయక్, ఉప సర్పంచ్ జగదీష్, తండా నాయకులు రాతిరాం నాయక్, ప్రహ్లాద్ నాయక్ ఇతర నాయకులు కలిసి తండాకు చెందిన టికారాంకు చెందిన 40 మంది కుటుంబాలను [&hellip;]</p>

తండావాసులను బహిష్కరించిన సర్పంచ్.. చివరికి ఏం జరిగిందంటే ?
X

దిశ, కామారెడ్డి : తండాకు చెందిన 40 కుటుంబాలను సర్పంచ్ బహిష్కరించారని ఆరోపిస్తూ తండా వాసులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ తండాకు చెందిన 40 కుటుంబాలు కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన సర్పంచ్ దశరథ్ నాయక్, ఉప సర్పంచ్ జగదీష్, తండా నాయకులు రాతిరాం నాయక్, ప్రహ్లాద్ నాయక్ ఇతర నాయకులు కలిసి తండాకు చెందిన టికారాంకు చెందిన 40 మంది కుటుంబాలను బహిష్కరించారని తెలిపారు.

తండాలో తమ కుటుంబాలను బహిష్కరించి గ్రామంలో ఏ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదన్నారు. 2005‌లో కూడా ఇదే సర్పంచ్ ఇలాగే బహిష్కరణ చేస్తే అప్పటి ఎస్పీకీ ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. స్పందించిన పోలీసులు గ్రామానికి వచ్చి సమావేశం నిర్వహిస్తే తప్పయిందని ఒప్పుకోవడంతో కేసు వాపసు తీసుకున్నామని, ఇప్పుడు కూడా మళ్లీ బహిష్కరణ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గ్రామంలో దుర్గామాత గడ్డను గుప్త నిధుల కోసం తవ్వి అందులో దొరికిన నిధులను అమ్ముకున్నారని ఆరోపించారు. గ్రామంలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసినా, ఇతర ఏ కార్యక్రమాలు చేసిన తమను రానియడం లేదన్నారు. తమను చంపడానికి కుట్రలు చేస్తున్నారని, తమకు సర్పంచ్ గ్రూప్ సభ్యుల ద్వారా ప్రాణహాని ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలను కోరారు.

Next Story