క‌న్నుల పండువ‌గా అయ్య‌ప్ప స్వామి తిరు ఆభ‌ర‌ణాల ఊరేగింపు

by Ratna Kumari |   (  Updated:2025-12-27 09:57:41  IST  )

దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరిసింది. శనివారం జడ్చర్ల పట్టణంలో పట్టణ అయ్యప్ప దేవాలయ

క‌న్నుల పండువ‌గా అయ్య‌ప్ప స్వామి తిరు ఆభ‌ర‌ణాల ఊరేగింపు
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరిసింది. శనివారం జడ్చర్ల పట్టణంలో పట్టణ అయ్యప్ప దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప తీరు ఆభరణాల శోభాయాత్ర ఆకట్టుకున్నది. పద్మావతి కాలనీ లోని తూడి పుల్లారెడ్డి గృహం నుంచి ప్రారంభమైన ఊరేగింపు మున్సిపాలిటీలోని ప్రధాన కూడళ్ళ మీదుగా మూడో వార్డు కల్వకుర్తి రోడ్డు సమీపంలో శ్రీ జ్ఞాన సరస్వతి సహిత అయ్యప్ప స్వామి దేవాలయం వరకు స్వామి ఆభరణాల ఊరేగింపు కనులపండువగా సాగింది. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు, కోలాటాలు భజనలతో ఆకట్టుకోగా అయ్యప్ప స్వాములు అయ్యప్ప నామ స్మరణతో పురవీధులను మారు మ్రోగించారు.

అయ్యప్ప స్వామి ఆలయంలో హరి నారాయణ గురు స్వామి ఆధ్వర్యంలో మహాపడిపూజ వైభవంగా జరిగింది. స్వాములు పెద్ద సంఖ్య లో హాజరై భక్తి పాటలు ఆలపిస్తూ తన్మయత్వానికి లోనయ్యారు. దీంతో జడ్చర్ల లో ఆధ్యాత్మిక పరిమ ళం సంతరించుకున్నది. అంతకుముందు ఉదయం ఆలయ కమిటీ సభ్యులు సుప్రభాత సేవ, లక్ష్మీ గణపతి హోమం, స్వామి వారి విశేష అభిషేకము, ద్వజారోహణము, అష్టోత్తర శతనామార్చన, పుష్పార్చన, తిరు ఆభరణాల పూజ మహా మంగళహారతి ఘనంగా నిర్వహించారు. అనంతరం భారీ ఎత్తున హాజరైన అయ్యప్ప స్వాములకు భక్తులకు మాదినేని వెంగమ్మ పెద్ద వెంగయ్య ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

Next Story