పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమ్ కరోనాకు వర్తించదు

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడిలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసులకు వైద్య చికిత్స సమస్యగా మారింది. కరోనా పాజిటివ్‌ వస్తే ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే చికిత్సకు పోలీసుశాఖలో ఉన్న ఆరోగ్య భద్రత స్కీమ్ వర్తించదని అదనపు డైరెక్టర్ జనరల్ స్పష్టం చేశారు. ఒకవేళ ఉచితంగా వైద్య సేవలను పొందాలంటే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కిందకు ఇంకా కరోనా చికిత్స చేరనందున ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించాల్సి వస్తుందని, ఉచితంగా వైద్య చికిత్స కోరుకునే పేషెంట్లను గాంధీ ఆసుపత్రికి పంపించాలని ప్రైవేటు ఆస్పత్రులకు రాసిన లేఖలో అదనపు డీజీపీ స్పష్టం చేశారు.

Next Story