ఈ టెస్ట్ సిరీస్ మాకు చాలా ముఖ్యం.. కివీస్ కోచ్ కీలక వ్యాఖ్యలు

by  |
Gary Stead
X

దిశ, స్పోర్ట్స్: కాన్పూర్ పిచ్‌ను పరిశీలించి.. ఇతర పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అవసరం అయితే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ అన్నాడు. ఇండియా-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు గురువారం నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కోచ్ గ్యారీ స్టీడ్ పలు విషయాలను వెల్లడించారు. ‘ఈ టెస్ట్ సిరీస్ మాకు చాలా కీలకమైనది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌గా కివీస్ ఆడుతున్న తొలి టెస్టు ఇదే. తొలి మ్యాచే విదేశీ గడ్డపై ఆడుతుండటంతో చాలా కట్టుదిట్టమైన వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాము.

గతంలో భారత పర్యటనకు వచ్చిన విదేశీ జట్లు ఎందుకు విఫలమయ్యాయో ఇప్పటికే పరిశీలించాము. మేం ఆ తప్పులను చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. భారత పిచ్‌లపై ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగితే ప్రభావం చూపలేము. అందుకే ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దింపితే విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్నాం. తొలి మ్యాచ్‌లో మా వ్యూహం కనుక విజయవంతం అయితే.. తప్పకుండా రెండో టెస్టులో అదే సూత్రాన్ని పాటిస్తాము. ఒకవేళ ఓడిపోతే తప్పకుండా మా వ్యూహాల్లో మార్పులు చేసుకుంటాము.’ అని గ్యారీ స్టీడ్ చెప్పుకొచ్చాడు. కాగా, టీ20 సిరీస్‌కు దూరమైన కేన్ విలియమ్‌సన్‌తో పాటు రాస్ టేలర్ టెస్టు జట్టులో ఉండటం కివీస్‌కు కలసి వచ్చే అవకాశం ఉన్నది.


Next Story

Most Viewed