బయటకు వెళ్లొస్తానని వెళ్లిన వ్యక్తి.. రక్తపు మడుగులో కనిపించేసరికి..

by Batti.Sumithra |

<p>దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో క్రేన్ కింద అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి రోజువారి కూలి పని చేసుకునే వెంకట్ (45) గా గుర్తించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం ఓవరాత్ జిల్లా బీదర్ మండలం బార్దాపూర్ గ్రామానికి చెందిన వెంకట్ ఐదేళ్ల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి కూలిపని నిమిత్తం కామారెడ్డికి వచ్చారు. రోజు మాదిరిగానే ఉదయం [&hellip;]</p>

crime news 1
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో క్రేన్ కింద అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి రోజువారి కూలి పని చేసుకునే వెంకట్ (45) గా గుర్తించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం ఓవరాత్ జిల్లా బీదర్ మండలం బార్దాపూర్ గ్రామానికి చెందిన వెంకట్ ఐదేళ్ల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి కూలిపని నిమిత్తం కామారెడ్డికి వచ్చారు. రోజు మాదిరిగానే ఉదయం పనికి వెళ్లిన వెంకట్ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాడు.

మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో బయటకు వెళ్లి వస్తానని కాలినడకన వెళ్లిన వెంకట్ బస్టాండ్ నుంచి నిజామాబాద్ వెళ్లే దారిలో ఓ క్రేన్ కింద రక్తపు మడుగులో శవమై కనిపించాడు. మృతుడిపై క్రేన్ వెళ్లిన దాఖలాలు కూడా అక్కడ కనిపించలేదు. మూడు రోజుల నుంచి క్రేన్ అక్కడే ఉందని స్థానికులు చెప్తున్నారు. వెంకట్ మృతదేహం క్రేన్ మధ్యలో పడి ఉంది. వెంకట్ ఎలా మృతి చెందాడనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మృతునికి భార్య లక్ష్మీ, 23 ఏళ్ల కొడుకు బాలాజీ, 15 సంవత్సరాల కూతురు అనిత ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story