అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

by Batti.Sumithra |   (  Updated:2021-07-16 11:07:04  IST  )

<p>దిశ, ఖైరతాబాద్ : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విబీలేస్ కుమార్ (29) రెండు నెలల నుంచి ఫోర్ వీల్ ట్రావెల్స్ లో న్యూ సెక్యూరిటీ సర్వీసెస్ తరఫున సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. గత నాలుగు రోజులుగా విబిలేష్ కనిపించకుండా పోయాడు. శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 లోని [&hellip;]</p>

murder 1
X

దిశ, ఖైరతాబాద్ : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విబీలేస్ కుమార్ (29) రెండు నెలల నుంచి ఫోర్ వీల్ ట్రావెల్స్ లో న్యూ సెక్యూరిటీ సర్వీసెస్ తరఫున సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. గత నాలుగు రోజులుగా విబిలేష్ కనిపించకుండా పోయాడు. శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 లోని నిర్మానుష్య ప్రదేశం నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ జరిపి క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరించారు. గత నాలుగు రోజుల క్రితమే మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యూపీలోని కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story