- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం తీసిన నీటి తెప్ప
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం సూర్యానాయక్ తండాలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సూర్యానాయక్ తండాకు చెందిన లునావత్ భంగ్య(58) తండాకు సమీపంలోని రేగులకుంట చెరువుకు అవతలి వైపు వున్న తన వ్యవసాయ భూమి వద్దకు సోమవారం నీటి తెప్ప మీద వెళ్లాడు. అనంతరం పొలాన్ని చూసుకొని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు నీటితెప్ప చెరువులో మునిగిపోయింది. దీంతో భంగ్య చెరువులో పడి మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు వెంకటేష్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం సూర్యానాయక్ తండాలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సూర్యానాయక్ తండాకు చెందిన లునావత్ భంగ్య(58) తండాకు సమీపంలోని రేగులకుంట చెరువుకు అవతలి వైపు వున్న తన వ్యవసాయ భూమి వద్దకు సోమవారం నీటి తెప్ప మీద వెళ్లాడు. అనంతరం పొలాన్ని చూసుకొని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు నీటితెప్ప చెరువులో మునిగిపోయింది. దీంతో భంగ్య చెరువులో పడి మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్వపల్లి ఎస్ఐ కే.మహేష్ తెలిపారు.
Next Story






