అఫీషియల్ : ‘పీకూ’ కాంబినేషన్ రిపీట్

by  |
అఫీషియల్ : ‘పీకూ’ కాంబినేషన్ రిపీట్
X

దిశ, సినిమా : బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ దివా దీపికా పదుకొనే స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం ‘పీకూ’. హార్ట్ వార్మింగ్ స్టోరీ లైన్‌‌తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌తో వావ్ అనిపించి.. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. కాగా ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్ స్పెషల్ ఫిల్మ్ కోసం మరోసారి కొలాబరేట్ కాబోతున్నారు. రిషి కపూర్, దీపిక లీడ్ రోల్స్‌లో గతేడాది అనౌన్స్ చేసిన ‘ది ఇంటర్న్’ హిందీ రీమేక్ ప్రాజెక్ట్.. రిషి మరణం తర్వాత ఆగిపోయింది.

కాగా ఇప్పుడు రిషి కపూర్ ప్లేస్‌లో అమితాబ్‌ నటిస్తుండగా.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న దీపిక.. ‘మోస్ట్ స్పెషల్ కోస్టార్‌తో మళ్లీ పనిచేయబోతుండటం గౌరవంగా భావిస్తున్నా.. ఇండియన్ అడాప్టేషన్ ‘ది ఇంటర్న్‌’ ప్రాజెక్ట్‌లోకి అమితాబ్‌కు స్వాగతం’ అంటూ బచ్చన్‌జీకి వెల్‌కమ్ చెప్పింది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు సునీర్ ఖెటెర్పాల్, దీపికా పదుకొనే నిర్మాతలు.


Next Story

Most Viewed