మైనర్ బాలిక ఆత్మహత్య.. మీడియా అత్యుత్సాహమే కారణమా.. ?

by  |
girl
X

దిశ, జడ్చర్ల : జడ్చర్లలో ఇటీవల చోటు చేసుకున్న ఫోక్సో రేప్ కేస్ బాధితురాలు మైనర్ బాలిక మానసిక భయాందోళనలు కలిగి అమ్మ నాన్న ఫ్రెండ్స్ బాయ్ ఓం శ్రీ సాయిరాం అంటూ లేఖ రాసి బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు ప్రైవేట్ ఉపాధ్యాయుడు మహేష్ సహకరించిన పంచాయతీరాజ్ సెక్రెటరీ మహేష్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇరువురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

పంచాయతీ రాజ్ కార్యదర్శి ని జిల్లా కలెక్టర్ విధుల నుంచి తొలగించారు. ఈ కేసులో మీడియా సంచలనాల పేరుతో అత్యుత్సాహాన్ని కనబరిచి ఈ కేసులో 62 మంది నిందితులు ఉన్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని తమకు తోచిన విధంగా కథ కథనాలు ప్రచురించడం, ప్రదర్శించడంతో రాష్ట్రస్థాయిలో సంఘటన చర్చనీయాంశమైంది. దీంతో బాధితురాలు మానసిక ఆందోళనకు గురై చివరకు ప్రాణాలు తీసుకుంది. వాస్తవాలను ప్రచురించాల్సిన పత్రికలు మీడియా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది. చివరకు పోలీసుల విచారణలో ఆ కథనంలో చెప్పినట్లు ఎలాంటి రుజువులు వెల్లడి కాకపోవడం గమనార్హం .

ఆ నోట ఈ నోట పలానా బాలిక అని బయటకు పొక్కడంతో ఆ కుటుంబం తో పాటు బాలిక మానసికంగా కుంగి పోయింది. మోసగించిన వాడితో పాటు మీడియాది కూడా బాధ్యతే నని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా సంచలనాలకు తావివ్వకుండా వాస్తవాలను బయటకు తెచ్చే విధంగా మీడియా పాత్ర పోషిస్తే బాగుంటుంది పలువురు సూచిస్తున్నారు. వార్తలు ,కథనాలు సమాజానికి బాగు పడేందుకు ఉపయోగపడాలి కానీ ఇలా సమాజాన్ని నష్ట పరిచేందుకు ప్రాణాలను బలిగొనే విధంగా వ్యవహరించకూడదు అని విషయం తెలిసిన వారు అంటున్నారు.



Next Story

Most Viewed