- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. చేవెళ్లలో చేపలు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, చేవెళ్ల: చేవెళ్ల మండలంలోని రామన్నగూడ, కొత్తపల్లి, ఎన్నికపల్లి మీదుగా ప్రవహిస్తున్న వాగులో నీరు కలుషితం కావడంతో వందల సంఖ్యలో చేపలు చనిపోయాయి. సర్పంచ్ చెన్నయ్య మాట్లాడుతూ వాగులో గుర్తుతెలియని వ్యక్తులు రసాయన పదార్థాలు పారబోశారని, దీంతో వాగులో నీరు కలుషితమై చేపలు మృతిచెందాయని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. వాగు సమీపంలో ఉన్న రైతులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, వాగులో రసాయన పదార్థాలు కలిపిన […]</p>

X
దిశ, చేవెళ్ల: చేవెళ్ల మండలంలోని రామన్నగూడ, కొత్తపల్లి, ఎన్నికపల్లి మీదుగా ప్రవహిస్తున్న వాగులో నీరు కలుషితం కావడంతో వందల సంఖ్యలో చేపలు చనిపోయాయి. సర్పంచ్ చెన్నయ్య మాట్లాడుతూ వాగులో గుర్తుతెలియని వ్యక్తులు రసాయన పదార్థాలు పారబోశారని, దీంతో వాగులో నీరు కలుషితమై చేపలు మృతిచెందాయని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. వాగు సమీపంలో ఉన్న రైతులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, వాగులో రసాయన పదార్థాలు కలిపిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పోలీసులు మాట్లాడుతూ.. వాగు వద్దకు వెళ్లి పరిశీలించామని, అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Next Story






