- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మతిస్థిమితం లేని కొడుకు.. తండ్రిని రోకలి బండతో..
<p>దిశ, కొత్తగూడెం: మతిస్థిమితం లేని కొడుకు చేతిలో తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని కొత్తగూడెం హనుమాన్ బస్తీకి చెందిన గోశిక కొమరయ్య ఇటీవలే సింగరేణి ఉద్యోగం చేస్తూ మెడికల్ అన్ఫిట్ అయ్యాడు. కొమరయ్య కి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా, చిన్న కుమారుడైన శివ కుమార్ (36)కు మతిస్థిమితం లేదు. ఈ క్రమంలో బుధవారం నాడు శివకుమార్ మద్యం తాగడానికి తన తండ్రి కొమరయ్యను డబ్బులు అడుగగా ఇవ్వకపోవడంతో మాట మాట పెరిగి గొడవకి […]</p>

X
దిశ, కొత్తగూడెం: మతిస్థిమితం లేని కొడుకు చేతిలో తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని కొత్తగూడెం హనుమాన్ బస్తీకి చెందిన గోశిక కొమరయ్య ఇటీవలే సింగరేణి ఉద్యోగం చేస్తూ మెడికల్ అన్ఫిట్ అయ్యాడు. కొమరయ్య కి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా, చిన్న కుమారుడైన శివ కుమార్ (36)కు మతిస్థిమితం లేదు. ఈ క్రమంలో బుధవారం నాడు శివకుమార్ మద్యం తాగడానికి తన తండ్రి కొమరయ్యను డబ్బులు అడుగగా ఇవ్వకపోవడంతో మాట మాట పెరిగి గొడవకి దారితీసింది.
ఈ క్రమంలోనే మతిస్థిమితం లేని శివకుమార్ డబ్బు ఎందుకు ఇవ్వవు అంటూ తండ్రిపై రోకలిబండతో దాడికి పాల్పడ్డాడు. బలమైన దెబ్బలు తగలడంతో తండ్రి కొమరయ్య అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఘటనపై విచారణ చేపట్టిన త్రీటౌన్ సీఐ వేణుచందర్ నిందితుడు శివకుమార్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






