- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూతురు అత్తారింటికి వెళ్లకముందే..
by Shyam |
<p>దిశ, డోర్నకల్: పెళ్లింట్లో తీరని విషాదం చోటుచేసుకుంది. కుమార్తె పెళ్లి ఘనంగా చేసి అత్తారింటికి సాగనంపిన తండ్రి గుండెపోటుతో మర్నాడే కన్నుమూశాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండలం మంగోళిగూడెంలో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం… మంగోళిగూడెం తండాకు చెందిన గుగులోత్ నందాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సోమవారం చిన్న కుమార్తెకు అట్టహాసంగా వివాహం చేసి అత్తారింటికి సాగనంపాడు. అనంతరం రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుండెపోటులో మరణించాడు. ఉదయం ఎంతకీ నిద్రలేవక పోవటంతో […]</p>

X
దిశ, డోర్నకల్: పెళ్లింట్లో తీరని విషాదం చోటుచేసుకుంది. కుమార్తె పెళ్లి ఘనంగా చేసి అత్తారింటికి సాగనంపిన తండ్రి గుండెపోటుతో మర్నాడే కన్నుమూశాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండలం మంగోళిగూడెంలో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం… మంగోళిగూడెం తండాకు చెందిన గుగులోత్ నందాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సోమవారం చిన్న కుమార్తెకు అట్టహాసంగా వివాహం చేసి అత్తారింటికి సాగనంపాడు. అనంతరం రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుండెపోటులో మరణించాడు. ఉదయం ఎంతకీ నిద్రలేవక పోవటంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండెపోటుతో అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. నంద మృతితో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు, బంధువుల రోదనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Next Story






