పేలిన సిలిండర్.. భారీ అగ్ని ప్రమాదం

by Batti.Sumithra |

<p>దిశ, హుజురాబాద్ : మంటలు అంటుకొని ఇళ్ళు పూర్తిగా దగ్ధమైన ఘటన జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అగ్నిమాపక పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం ఇంటికి తాళం వేసి రామగుండం పోలీస్ స్టేషన్‌లో ట్రైనింగ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కూతురు దగ్గరకు పానుగంటి మాణిక్యం దంపతులు వెళ్లారు. రాత్రి 7:15 సమయంలో ఇల్లుకు మంటలు అంటుకోవడంతో స్థానికులు పోలీసులకు, ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి [&hellip;]</p>

పేలిన సిలిండర్.. భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, హుజురాబాద్ : మంటలు అంటుకొని ఇళ్ళు పూర్తిగా దగ్ధమైన ఘటన జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అగ్నిమాపక పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం ఇంటికి తాళం వేసి రామగుండం పోలీస్ స్టేషన్‌లో ట్రైనింగ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కూతురు దగ్గరకు పానుగంటి మాణిక్యం దంపతులు వెళ్లారు. రాత్రి 7:15 సమయంలో ఇల్లుకు మంటలు అంటుకోవడంతో స్థానికులు పోలీసులకు, ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ ఆ ఇంట్లో సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా దగ్నం అయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ సుమారుగా 5 నుంచి 10 లక్షల నష్టం వాటిల్లుతుందని ఫైర్ అధికారి తెలిపారు.

Next Story