ప్యారడైస్, డీమార్ట్ లకు భారీ షాక్.. ఇకనుంచి క్యారీ బ్యాగ్‌లు ఫ్రీ

by  |
ప్యారడైస్, డీమార్ట్ లకు భారీ షాక్.. ఇకనుంచి క్యారీ బ్యాగ్‌లు ఫ్రీ
X

దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్, బేగంపేట ప్యారడైస్ రెస్టారెంట్లు, హైదర్ గూడ డీమార్ట్ లు క్యారీ బ్యాగులకోసం అదనంగా డబ్బులు వసూలు చేయటాన్ని హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తప్పుపట్టింది. ఒక్కొక్కరికీ రూ.50వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఫిర్యాదుదారులు విజయ్ గోపాల్ ట్విట్టర్లో వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. విజయ్ గోపాల్ అనే వ్యక్తి 2019 ఏప్రిల్ లో సికింద్రాబాద్ ప్యారడైజ్ రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని కొనుగోలు చేశారు. రెండు నెలల తరువాత, అతను మళ్లీ ప్యారడైజ్ రెస్టారెంట్ బేగంపేట నుండి ఆహారాన్ని కొనుగోలు చేశారు. అంతేకాకుండా, ఆయన 2019 జూన్ లో హైదర్‌గూడలోని డీ-మార్ట్ నుండి కిరాణా సామాగ్రిని కొనుగోలు చేశారు. ఈ సందర్భంలో ప్యారడైజ్ రెస్టారెంట్ క్యారీ బ్యాగ్ కోసం రూ.4.76 ఛార్జ్ చేయగా, డీ మార్ట్ రూ. 3.5 వసూలు చేసింది. దీనిపై ఆయన వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు. దీంతో క్యారీ బ్యాగ్‌ల ఛార్జీలను నిలిపివేయాలని కమిషన్ రెస్టారెంట్, రిటైల్ అవుట్‌లెట్‌ను ఆదేశించింది. “క్యారీ బ్యాగ్‌ల కోసం ఛార్జ్ చేయడం ఆపివేసి, వినియోగదారులందరికీ ఉచితంగా అందించండి” అని కమిషన్ తెలిపింది.

Next Story

Most Viewed