మరో దుస్సాహసం చేసిన చైనా..

by  |
మరో దుస్సాహసం చేసిన చైనా..
X

దిశ, వెబ్ డెస్క్ : భారత సరిహద్దుల దగ్గర గుంట నక్కలా కాచుకు కుర్చున్న చైనా, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ లో మరోసారి కంచె దాటడానికి ప్రయత్నించింది. ఒక వైపు శాంతి చర్చలు అంటూనే మరో వైపు భారత్ భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తోంది. సైన్యం అప్రమత్తంగా ఉండటంతో చైనా సైన్యం ఆటలు సాగలేదు. అయితే మాటలతో ఆగకుండా భౌతిక ఘర్షణలు జరిగాయి. దాదాపు 100 మంది చైనా సైనికులు భారత్ భూభాగంలోకి వచ్చారనే సమాచారంతో ఇండియన్ ఆర్మీ అదనపు బలగాలను మోహరించింది. అంతే కాకుండా భారత్ కొంత మంది చైనా సైనికులను బంధించింది అని కూడా పుకార్లు వచ్చాయి. ఒక్క తూటా కూడా పేలక పోయినా చైనా చేస్తున్న దుందుడుకు చర్యలు ఆగడం లేదు. చైనా సైనికులను బంధించిన అంశం పై చైనా విదేశాంగ ప్రతినిధి ఝౌ లిజియాన్‌ మాత్రం స్పందించలేదు.

మెక్ మోహన్ రేఖ ఎప్పటినుంచో వివాదంగా నడుస్తోంది. అంతేకాదు అప్పట్లో చైనా మన అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా భూభాగాలను తనవిగా చూపించుకుంది. భారత్ అంతర్జాతీయంగా ఈ వివాదాన్ని తీసుకుపోవడంతో తన తప్పును ఒప్పుకుంది. చైనా ఒక్క అరుణాచల్ ప్రదేశ్ విషయంలోనే కాదు, మొన్నటికి మొన్న ఉత్తరాఖండ్‌లోని బారాహోటి సెక్టార్‌లోకి దాదాపు 100 మంది చైనా సైనికులు చొచ్చుకొచ్చిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed