రైతుల డిమాండ్లపై కేంద్రం సానుకులం.. మరికొన్ని గంటల్లో కీలక నిర్ణయం

by  |
farmersdelhi
X

న్యూఢిల్లీ: రైతు సంఘాల భవిష్యత్తు కార్యాచరణపై బుధవారం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రకటించింది. మంగళవారం సింఘా సరిహద్దుల్లో జరిగిన సమావేశంలో రైతులకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు వెల్లడించారు. దాదాపు అన్ని డిమాండ్లకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కేంద్రం ముఖ్యమైన రైతు డిమాండ్లు కనీస మద్దతు ధర చట్టం, నిరసనకారులపై కేసుల ఎత్తివేత ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

సాగు చట్టాలు రద్దు తర్వాత రైతు మోర్చా గత నెల 21న ఆరు డిమాండ్లను కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. రైతు ఉద్యమాల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకునేందుకు హర్యానా, యూపీ ప్రభుత్వాలు అంగీకరించాయని కేంద్ర ప్రభుత్వం తెలిపినట్లు ఎస్కేఎం వెల్లడించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసులు వెనక్కి తీసుకున్నారు. విద్యుత్ చట్టం నూతన బిల్లు విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. గాలి నాణ్యత విషయమై గడ్డిని తగులబెట్టిన రైతులపై కేసులు పెట్టమని కేంద్రం అంగీకరించింది అని ఎస్కేఎం వర్గాలు వెల్లడించాయి. కాగా ఇప్పటికే కేంద్రం కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story