వధూవరులకు షాకిచ్చిన గ్రాండ్ ఎంట్రీ.. పాపం ఉన్నట్టుండి అలా పడిపోయారు

by  |
వధూవరులకు షాకిచ్చిన గ్రాండ్ ఎంట్రీ.. పాపం ఉన్నట్టుండి అలా పడిపోయారు
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అంటే నూరేళ్ల పంట. ఇక ఈ ప్రత్యేకమైన రోజు ఎప్పటికి గుర్తుండి పోయేలా.. పది మంది ఆ పెళ్లి ఇలా జరిగింది అనుకోవడానికి కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. కొందరు విమానంలో దిగడం ఇలా డిఫరెంట్ స్టైల్‌లో పెళ్లి వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలానే ఓ జంట తమ పెళ్లి తీపి గుర్తుగా ఉండాలని గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అందుకోసం స్పెషల్‌గా జేసీబీ బకెట్‌లోకి ఎక్కి కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు. కానీ ఆ గ్రాండ్ ఎంట్రీ వీరికి ఊహించని షాక్ ఇచ్చింది. కొంచెం కొత్తగా ట్రై చేద్దామనుకుంటే అదే వీరికి పెద్ద సమస్యగా మారింది. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా.. ?

నవ వధూవరులు కొత్త స్టైల్‌లో జేసీబీ బకెట్‌లోకి ఎక్కి ఫొటోస్ దిగుతున్నారు. అయితే ఆ సమయంలో హైడ్రాలిక్ సిస్టంలో సమస్య రావడంతో బకెట్ ఒక్కసారిగా కిందకు వంగింది దీంతో ఇద్దరు డైనింగ్ టేబుల్ పై పడిపోయారు. ఆ సమయంలో అక్కడ అతిధుల కోసం ఏర్పాటు చేసిన డైనింగ్ టేబుల్ ఉంది, ఉన్నట్టుండి వారు దానిపై పడిపోయారు. వీరు పడిపోవడంతో డిన్నర్ చేస్తున్న బంధు మిత్రులు ఒక్కసారిగా షాకై వారిని పైకి లేపారు. అంతే కాకుండా 10 అడుగుల ఎత్తునుంచి కిందపడటంతో బంధువులందరూ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడున్నవారు దీన్ని వీడియో తీయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన కొందరూ మరీ అంతలా ట్రై చేయకూడదు అంటే, మరికొందరు పెద్ద ప్రమాదం తప్పింది అంటున్నారు. ఏదేమైనా ఈ వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది.

Next Story

Most Viewed