స్టేడియంలోకి ప్రేక్ష‌కుల‌ు.. ఆ మ్యాచ్ నుంచే?

by  |
స్టేడియంలోకి ప్రేక్ష‌కుల‌ు.. ఆ మ్యాచ్ నుంచే?
X

దిశ, వెబ్‌డెస్క్: ధోనీ సిక్సులు, షమీ స్వింగులు, విరాట్ బ్యాటింగ్ ప్రత్యక్షంగా స్టేడియంలో చూసి చాలా కాలం అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందడంతో క్రీడాభిమానులను స్టేడియంలోకి అనుమతి నిరాకరించారు. దాదాపు ఏడాదిపైగా క్రికెట్ అభిమానులు ఆ ఆనందానికి దూరం అయ్యారు. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతూ.. కొత్త రోగుల సంఖ్య గణనీయంగా పడిపోతున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా కరోనా వైరస్‌ నివారణకు మన దేశంలో వ్యాక్సిన్‌ ఇవ్వడం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి భారత్‌-ఇంగ్లండ్‌ మార్చి నెల రెండో వారం నుంచి జరిగే టీ20 సిరీస్ నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించడంపై బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

టీ20 సిరీస్ మొదటి మ్యాచ్ మార్చి 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ స్టేడియంలో జరుగనున్నది. అభిమానులను స్టేడియంలోకి అనుమతించే విషయం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉంటుందని బీసీసీఐ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం అనుమతించినా… 50 శాతం సామర్ధ్యంతోనే ప్రేక్షుకుల ప్రవేశాన్ని బోర్డు ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని త్వరలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వపరంగా అనుమతి పొందేలా బీసీసీఐ చర్యలు తీసుకొంటున్నది. ఈ క్రమంలో భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్ టెస్టు మ్యాచుతో ప్రారంభమవుతుంది. మొదటి రెండు టెస్టులు ఫిబ్రవరి 5–09, ఫిబ్రవరి 13–17 తేదీలలో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతాయి. ఈ మ్యాచ్‌లకు టికెట్లు అమ్మడం లేదని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే స్పష్టం చేసింది.

Next Story

Most Viewed