మానవత్వమే సిగ్గుపడేలా.. అంబులెన్స్ సిబ్బంది నిర్వాకం

by  |
మానవత్వమే సిగ్గుపడేలా.. అంబులెన్స్ సిబ్బంది నిర్వాకం
X

దిశ, హుస్నాబాద్: మానవత్వం సిగ్గు పడేలా.. నిండు బాలింతను అంబులెన్స్ సిబ్బంది నడి రోడ్డుపై దింపిపోయారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 7వ వార్డు బస్ డిపో కాలనీలో ఈ యదార్థ సంఘటన చోటుచేసుకుంది. బస్ డిపో కాలనీలో నివసిస్తున్న పర్వతం నర్సయ్య, సరవ్వ దంపతుల కుమార్తె శీరిషకు నెలలు నిండి పురిటి నొప్పులు రావడంతో నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లారు. దేవుని దయతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రి నుండి తల్లి బిడ్డలను ప్రభుత్వమే 102 అంబులెన్స్ లో క్షేమంగా ఇంటికి చేర్చుతుంది.

ఈ క్రమంలో శీరిష ఇంటికి రహదారి సక్రమంగా లేకపోవడంతో మధ్యలోనే దింపి వెళ్లిపోయారు. దీంతో మురుగునీటిలో నుంచి బిడ్డను మోస్తూ తల్లి, కేసీఆర్ కిట్టును అమ్మమ్మ మోస్తూ మురుగునీటిని దాటుతున్న వైనాన్ని స్థానికులే కాక, చూపరులను సైతం విస్మయానికి గురిచేసింది. కేసీఆర్ సొంత జిల్లాలో ఇలాంటి ఘటనలపై ప్రజలు, కాలనీ వాసులు ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed