‘సెలబ్రిటీలున్నా ఉపేక్షించొద్దు’.. పోలీసులకు CM రేవంత్‌రెడ్డి కీలక ఆదేశం

by Satheesh |
‘సెలబ్రిటీలున్నా ఉపేక్షించొద్దు’.. పోలీసులకు CM రేవంత్‌రెడ్డి కీలక ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్ కేసుల్లో సెలెబ్రిటీలున్నా, వారు ఏ స్థాయివారైనా ఉపేక్షించొద్దని నార్కొటిక్స్ విభాగం అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉండాలని నొక్కిచెప్పారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనలో నార్కొటిగ్స్ వింగ్ సాధించిన పురోగతిపై సంబంధిత అధికారులు వివరాలను అందించారు. రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్ధాలపై ఉక్కుపాదం మోపాలని, మరింత యాక్టివ్‌గా పనిచేయాలన్నారు. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని, సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని, సప్లై చైన్‌ను బ్రేక్ చేయాలన్నారు.

వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలుండాలని నొక్కిచెప్పారు. అవసరాలకు అనుగుణంగా యాంటీ డ్రగ్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ నిర్మూలన కోసం ఎఫెక్టివ్‌గా పనిచేసేవారిని ప్రోత్సహించాలన్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం, సహాయం కావాలన్నా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు భరోసా కల్పించారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదాన్ని వింటేనే భయపడేలా చర్యలుండాలన్నారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ నార్కొటిక్స్ బ్యూరో ఆదర్శంగా నిలవాలన్నారు.

Next Story

Most Viewed