తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. డ్రిప్ ఇరిగేషన్ సిస్టం కంటిన్యూ, మరిన్ని పంటలకు వర్తింపు

by Mahesh |
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. డ్రిప్ ఇరిగేషన్ సిస్టం కంటిన్యూ, మరిన్ని పంటలకు వర్తింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇప్పుడున్న పంటలకే కాకుండా మరిన్ని పంటలకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టం‌ను కొనసాగించాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు‌కు శనివారం డ్రిప్ కంపెనీల ప్రతినిధులు విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మున్ముందు మరిన్ని పంటలకు ఈ సౌకర్యము వర్తించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కంపెనీ ప్రతినిధులకు తెలిపారు. డ్రిప్ కంపెనీల సహకారం ఇక ముందు కూడా కొనసాగాలని, తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ ను సాగులో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను పంపిణీ చేస్తునట్లు, ఇప్పటికే రాష్ట్రంలో 57000 వేల ఎకరాలు ఆయిల్ పామ్ తోటలలో ఇన్‌స్టాలేషన్ పూర్తి అయిందని కంపెనీ ప్రతినిధులు మంత్రికి తెలిపారు .

Next Story

Most Viewed