ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు : పవన్‌ కల్యాణ్‌

by  |
ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు : పవన్‌ కల్యాణ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా తునిలోని కొత్తపాకలలో దివీస్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ.. ఆందోళన చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిని ఖండించిన జనసేన పార్టీ బాధితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అంతేగాకుండా దివీస్ కర్మాగారంతో పరిసర గ్రామాల్లోని గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని.. వారి సమస్యలను సీఎం జగన్ వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆదివారం దివీస్ నిరసనకారులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేనాని మీడియాతో మాట్లాడుతూ… హైకోర్టు, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దివీస్ కర్మాగారం విడుదల చేసే కాలుష్యంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారన్నారు. 36 మందిని అరెస్టు చేసి జైలులో పెట్టడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. బెయిలు రావడానికి సహకరించిన అందరికీ జనసేన తరపున కృతజ్ఞతలు చెప్పారు. అంతేగాకుండా వారిపై పెట్టిన కేసులను పూర్తిగా ఎత్తివేయాలని అన్నారు.


Next Story