ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టివేత

by Disha Web Desk 11 |
ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టివేత
X

దిశ, శేరిలింగంపల్లి : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతుంది. తాజాగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఒక్కరోజే రూ 1,96,70,324 నగదును సీజ్ చేశారు పోలీసులు. సైబరాబాద్ ఎస్ఓటీ టీమ్స్ సైబరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్స్ సిబ్బంది తో కలిసి భారీగా నగదు పట్టుకున్నారు. బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే 7 వాహనాలలో సరైన క్యూఆర్ కోడ్‌లు, ఎన్నికల సంఘం ఇతర విధానాలు అనుసరించకుండా తరలిస్తున్న రూ. 1,81,70,324ల నగదును సీజ్ చేశారు. ఇందులో మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రైవేట్ వాహనంలో రూ. 15లక్షలను అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నారు.

అలాగే ఎస్ఓటీ మేడ్చల్ టీమ్ బ్రింక్స్ క్యాష్ లాజిస్టిక్స్ వాహనం ( ఈఎస్ 10 యూడీ 1868 )లో తరలిస్తున్న రూ.74,07,791లను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేశారు. ఎడ్ ఓటీ శంషాబాద్ టీమ్ సీఎంఎస్ వాహనం ( టీఎస్ 10 యూడీ 6979)లో తరలిస్తున్న. రూ.34 లక్షలను కొత్తూరు పోలీస్ స్టేషన్ లో పరిధిలో సీజ్ చేశారు. ఎస్ ఓటీ మాదాపూర్ టీమ్ రైటర్ సేఫ్ గార్డ్ వాహనం (టీఎస్ 09 యూడీ 4042 ) లో తరలిస్తున్న రూ. 21,74,520 నగదును మాదాపూర్ పోలీసులు సీజ్ చేశారు. మరో ఘటనలో మాదాపూర్ ఎస్ ఓటీ టీమ్ రైటర్ సేఫ్ గార్డ్ వాహనం ( టీఎస్ 09యూడీ 4033 ) లో రూ.19,26,405 చందానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సీజ్ చేశారు.

ఎస్ ఓటీ రాజేంద్రనగర్ టీమ్ రైటర్ సేఫ్ గార్డ్ వాహనం ( ఎంపీ 09 జీహెచ్ 6293 ) లో తరలిస్తున్న రూ. 15,49,848 నగదును రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేశారు. ఎస్ ఓటీ రాజేంద్రనగర్ టీమ్ రైటర్ వెహికల్( టీఎస్ 09 యూడీ 3718 )లో తరలిస్తున్న రూ. 11,63,560 నగదును నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సీజ్ చేశారు. అలాగ్ ఎస్ ఓటీ బాలానగర్ టీమ్ రేడియంట్ వాహనం ( టీఎస్ 11 యూడీ 2560 )లో తరలిస్తున్న రూ. 5,48,200 నగదును కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేశారు. ఎస్ ఓటీ మాదాపూర్ టీమ్ మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ వ్యక్తి తన ఎక్స్ మూవీ 100 ( టీఎస్ 07 ఈఎక్స్ 9200) లో నగదును తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసి అతని వద్ద నుండి రూ. 15 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ సీపీ కమిషనరేట్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Next Story

Most Viewed