- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆబ్కారీ భవన్లో టీజీఓ సంబురాలు
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై ఆబ్కారీ భవన్లో ఉద్యోగుల సంబురాలు మిన్నంటాయి. రాష్ట్ర ప్రభుత్వం మంగళ వారం అసెంబ్లీలో వేతన సవరణ ప్రకటన చేయడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆబ్కారీ మంత్రి డా.వి శ్రీనివాస్ గౌడ్ కు ఆబ్కారీ గెజిటెడ్ అధికారులు, ఆబ్కారీ ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ , మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేయడంతో పాటు […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై ఆబ్కారీ భవన్లో ఉద్యోగుల సంబురాలు మిన్నంటాయి. రాష్ట్ర ప్రభుత్వం మంగళ వారం అసెంబ్లీలో వేతన సవరణ ప్రకటన చేయడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆబ్కారీ మంత్రి డా.వి శ్రీనివాస్ గౌడ్ కు ఆబ్కారీ గెజిటెడ్ అధికారులు, ఆబ్కారీ ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ , మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేయడంతో పాటు టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఓ ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, అబ్కారీ విభాగం అధ్యక్షుడు టి.రవీందర్ రావు, హైదరాబాద్ ఆబ్కారీ సూపరింటెండెంట్ శీలం శ్రీనివాస్ రావు, కోశాధికారి తమటం లక్ష్మణ్ గౌడ్, రాజిరెడ్డి, ఆనంద్, టీజీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్, నగరశాఖ అధ్యక్షుడు గండూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






