- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనకాపల్లిలో ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలి..
<p>దిశ, వెబ్‌డెస్క్ : విశాఖపట్నం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ వాహనాలపై కూలిపోవడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. జిల్లాలోని అనకాపల్లి జాతీయ రహదారిపై.. హైవే విస్తరణ కోసం నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బీమ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలో బీమ్ రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు, ఓ లారీ ధ్వంసం కాగా.. ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖపట్నం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ వాహనాలపై కూలిపోవడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. జిల్లాలోని అనకాపల్లి జాతీయ రహదారిపై.. హైవే విస్తరణ కోసం నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బీమ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలో బీమ్ రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై పడిపోయింది.
ఈ ప్రమాదంలో రెండు కార్లు, ఓ లారీ ధ్వంసం కాగా.. ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీమ్ విరిగిపడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో నాణ్యత లోపించడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంతోపాటు ఫ్లై ఓవర్ కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






