టెంట్‌హౌస్ నిర్వాహకుడు ఆత్మహత్య

by  |

దిశ, హైదరాబాద్: కాచిగూడకు చెందిన ఓ టెంట్‌ హౌస్‌ నిర్వాహకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుల్తాన్‌బజార్‌ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సావెల గణేష్‌కుమార్‌(55) టెంట్‌హౌస్‌ నిర్వహిస్తున్నారు. రాజ్‌మోహల్లాలో గోదాం ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. టెంట్‌హౌస్‌ను ఖాళీ చేయాలంటూ ఇటీవల యజమాని ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 21న రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఉదయం పెద్దకుమారుడు గోదాంకు వెళ్లి చూడగా, తన తండ్రి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉండడం చూసి షాక్‌కు గురయ్యాడు. మృతుడి జేబులో సూసైడ్‌ నోట్‌ లభించింది. నిరంజన్‌రావు, జయపాల్‌రావు, కృష్ణమూర్తి కులం పేరుతో దూషించి అవమానించడంతో ఆత్మహత్య చేసుకుంటున్న‌ట్లు గణేష్ లేఖలో రాశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story