వరంగల్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్.. పదివేల మందికి ఉద్యోగాలు!

by  |
వరంగల్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్.. పదివేల మందికి ఉద్యోగాలు!
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపారు. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో 104 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. జిల్లాలో పండించిన ధాన్యం, కూరగాయలు తదితర ఉత్పత్తులను సేకరించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో శుద్ధిచేసి నాణ్యమైన ఉత్పత్తులు ప్రజలకు అందించడం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రధాన లక్ష్యం. నియోజకవర్గ అభివృద్ధి లో భాగంగా ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు జరిగితే ఈ ప్రాంత అభివృద్ధి తో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఇక్కడ ప్రజలు ఆశిస్తున్నారు పేర్కొన్నారు.

Next Story

Most Viewed