ఫస్ట్ వీక్‌లో నామినేటెడ్ పండుగ.. కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

by Shiva |
ఫస్ట్ వీక్‌లో నామినేటెడ్ పండుగ.. కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల కంటే ముందు ఇప్పటికే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన సర్కారు.. కోడ్ ముగియగానే మరో 17 మంది పేర్లను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నది. ఫస్ట్, సెకండ్ లిస్టు కలిపి 54 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర కార్పొరేషన్ పదవుల్లో సీఎం లక్కీ నంబరు ‘9’ వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. వీరంతా ఒకేసారి పదవీ బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో అందరికీ జీవోలు అందనున్నాయి. ఈ మేరకు రెండో లిస్టులో చేర్చబోయే పేర్లపై పీసీసీ చీఫ్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. క్యాస్ట్ ఈక్వెషన్స్, పార్టీలో శ్రమించిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఫస్ట్ లిస్టులోనూ గాంధీభవన్ కేంద్రంగా పని చేసిన వివిధ పార్టీ విభాగాల చైర్మన్లే, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లకూ నియమించారు. కొందరు జిల్లా స్థాయిలో పని చేసిన కీలక నేతలకు కూడా ఫస్ట్ జాబితాలో అవకాశం లభించింది. ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తూ, క్యాస్ట్ ఈక్వెషన్స్ కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు ఓ నేత తెలిపారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఎక్కువ మందికి రెండో జాబితాలో చోటు లభించే ఛాన్స్ ఉన్నదని ఆయన వివరించారు. ఇక ఫస్ట్ లిస్టులో లేని పార్టీ అనుబంధ సంఘాలకు, సెకండ్ లిస్టులో ప్రాతినిధ్యం కల్పించనున్నారు. పైగా కార్పొరేషన్లలో అత్యధికంగా యువ నాయకులకే ఇవ్వాలని సీఎం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

టికెట్ రానోళ్లకే!

నామినేటెడ్ పదవుల్లో ఈ సారి జిల్లా అధ్యక్షులకూ అవకాశం ఉంటుందనే చర్చ గాంధీభవన్ లో జరుగుతున్నది. కొంత మంది కార్పొరేషన్ పదవులను ఆశిస్తున్నారని, వాళ్లకు రెండో జాబితాలో అవకాశం ఉండొచ్చనే చర్చ ఉన్నది. దీంతో పాటు అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడ్డ నేతల్లో కొందరికి రెండో జాబితాలో చోటు దక్కనున్నది. అయితే అసెంబ్లీ టిక్కెట్లు పొంది ఓడిపోయినోళ్లను చైర్మన్లుగా ప్రకటించే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓడిపోయిన నేతలు కూడా తమకు ఈ దఫా అవకాశమివ్వాలని సీఎం ముందు ప్రపోజల్ పెట్టినట్లు తెలిసింది. కానీ పార్టీ విధి, విధానాలను బ్రేక్ చేసే పరిస్థితి లేదని సీఎం తేల్చిచెప్పినట్లు సమాచారం.

స్థానిక సంస్థల కోసం కూడా!

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. పదేళ్ల తర్వాత పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్, మెజార్టీ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లు గెలవాలనిగా లక్ష్యం పెట్టుకున్నది. దీంతో అన్ని జిల్లాలకు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించేందుకు పార్టీ ప్రయత్నిస్తున్నది. గత రెండు రోజుల నుంచి మంత్రులు, డీసీసీలు ఆయా జిల్లాల్లో కీలక నేతల వివరాలను గాంధీభవన్ కు పంపిస్తున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి వర్క్ చేసినోళ్లకు, వివిధ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రేసులో ఉన్న నేతల వివరాలను కూడా టీపీసీసీ స్టేట్ కమిటీకి పంపించారు. 17 స్థానాల కోసం దాదాపు వందకు పైనే పేర్లు వచ్చినట్లు తెలిసింది. సీఎం, కేబినెట్ మంత్రులు సమన్వయంతో ఈ నెలాఖరు వరకు పేర్లను ఫైనల్ చేయనున్నారు. ఆ తర్వాత కోడ్ ముగియగానే ఆర్డర్ కాపీలు అందజేయనున్నారు.

Next Story

Most Viewed