ఆ కారణంగానే ప్రభాస్‌ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసిన అనుష్క.. షాకింగ్ విషయాలు వెలుగులోకి!

by Kavitha |
ఆ కారణంగానే ప్రభాస్‌ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసిన అనుష్క.. షాకింగ్ విషయాలు వెలుగులోకి!
X

దిశ, సినిమా: ‘సూపర్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ కాలంలోనే అనుష్క తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నది. తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నది. అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసింది. జీరో సైజ్ సినిమాతో దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆ వెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మామూలు స్థితికి వచ్చింది. గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మరో సినిమాను అనుష్క అంగీకరించలేదు.


ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించి ఇప్పటికే చాలా రూమర్స్ తెర మీదకు వచ్చాయి. హీరో ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందని వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చాలానే కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అవన్నీ కూడా కూడా ప్రచారాలకు మాత్రమే పరిమితం అయ్యాయి.


ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాను అనుష్క రిజెక్ట్ చేసిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా అనుష్కను తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆ క్యారెక్టర్‌లో తాను సెట్ అవ్వననే ఉద్దేశ్యంతో సినిమాకి ఓకె చెప్పలేదంట. దీంతో ఆదిపురుష్‌లో కృతిసనన్‌ను హీరోయిన్‌గా తీసుకోవడం జరిగింది. అయితే ఆదిపురుష్‌ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో అనుష్క ఈ సినిమా నుంచి తప్పుకుని మంచి పని చేసిందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed