గోల్డ్ కాయిన్స్ అమ్ముతున్న‌ జింబాబ్వే ప్ర‌భుత్వం.. ఎందుకో తెలుసా..?!

by Disha Web Desk 20 |
గోల్డ్ కాయిన్స్ అమ్ముతున్న‌ జింబాబ్వే ప్ర‌భుత్వం.. ఎందుకో తెలుసా..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః జింబాబ్వే గత దశాబ్ద కాలంగా ద్రవ్యోల్బణంతో న‌లిగిపోతోంది. సంవత్సరాలుగా ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురాడానికి ప్ర‌భుత్వం అనేక మార్గాలను ప్రయత్నించారు. అందులో భాగాంగా సోమవారం ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. దేశ‌ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే ప్రయత్నంలో ప్ర‌భుత్వం బంగారు నాణేలను వేలం వేయాల‌ని నిర్ణ‌యించింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వే దీనిపై ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. దీని ప్రకారం, ద్రవ్యోల్బణం కారణంగా తీవ్రంగా ప్రభావితమైన స్థానిక కరెన్సీని వృద్ది చేయ‌డానికి బంగారు నాణేలను ప్రజలకు విక్రయించనున్నారు. ఎందుకంటే, ఈ బంగారు నాణేలు విక్ర‌యంతో ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ధ‌నం స‌మ‌కూరుతుంది. అలాగే, దేశంలో ఆర్థిక సంక్షోభం కార‌ణంగా జింబాబ్వేలో ప్రజలు బ్లాక్ మార్కెట్ నుండి అమెరికా డాలర్లు పొందడం అక్క‌డ స‌ర్వ‌సాధారణంగా మారింది. ఇక‌, ఈ చర్యతో దేశంలో అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయవచ్చని కూడా ఆలోచిస్తున్నారు.

అయితే, దీని కోసం రిజర్వ్ బ్యాంక్ 2000 నాణేలను ఉత్పత్తి చేసింది. వాటిని వాణిజ్య బ్యాంకులకు అందించింది. ప్రజలు ఆ నాణేల‌ను అధీకృత బ్యాంకుల నుండి కొనుగోలు చేయగలుగుతారు. ఈ క్ర‌మంలో అనేక మంది విక్రేతలు అధికారిక కరెన్సీని స్వీకరించరు కాబ‌ట్టి, ఈ బంగారు నాణేలే లావాదేవీల కొత్త మార‌కంగా మారవచ్చని అంచ‌నా వేశారు. ఒక‌ప్పుడు క‌రెన్సీని మార్కెట్లో గుట్టలుగా పెట్టి విక్ర‌యించినా డాల‌ర్ల మార‌కం త‌గ్గ‌క‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యం ప‌రిస్థితిని మార్చ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఇక‌, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వే ఉన్న‌తాధికారి జాన్ మాంగుడియా అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ, నాణేలు దేశం వెలుపల ముద్రిస్తున్నార‌ని, కొన్నాళ్ల‌కు వాటిని దేశంలోనే సృష్టించాలని అన్నారు.


Next Story