నాగుపాముగా మారిన యువతి.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

by Muthe.Rajitha |

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ వింత ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది.

నాగుపాముగా మారిన యువతి.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ వింత ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. పోలీసుల విచారణలో వెల్లడైన నిజాలు చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. ఔరాయ జిల్లా సింగనపూర్ గ్రామానికి చెందిన రీనా అనే ఒక యువతి నాగుపాముగా మారిందనే వార్త మొదట రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు రంగంలోకి దిగి సేకరించిన ఆధారాల ప్రకారం.. రీనా గ్రామానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. ఇంట్లో వాళ్ళు తమ ప్రేమకు అంగీకరించని తెలిసి.. ఇంట్లోంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అయితే ఎవరికీ అనుమానం రాకుండా చాలా తెలివిగా ఒక కథ తయారు చేసింది. రెండు నెలలుగా తనకు కలలో నాగదేవతలు కనిపిస్తున్నాయని, తనను నాగలోకానికి రమ్మని పిలుస్తున్నారని ఇంట్లో వాళ్లకు చెబుతూ వచ్చింది.

తాను సాధారణ మనిషి కాదని, దేవత అవతారమని నమ్మించేలా నెమ్మదిగా వారి మనసుల్లో అనుమానం లేకుండా చేసింది. సమీపంలోని నాగదేవత ఆలయానికి వెళ్లి అక్కడి నుంచి ఒక నాగదేవత విగ్రహం కూడా తీసుకువచ్చి ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది. దీంతో తల్లిదండ్రులు ఆమె మాటలను కొంతవరకు నిజమే అనుకున్నారు. ఈ క్రమంలో ఒక రోజు పాములు పట్టే వారితో మాట్లాడి ఐదు అడుగుల నాగుపాము కుబుసం తెచ్చుకుంది. ఆ రాత్రి తన గదిలో బెడ్ మీద ఆ కుబుసం పెట్టింది. అలాగే గాజులు, కుంకుమ వంటి వస్తువులు కూడా అక్కడే ఉంచింది. ఇలా చేసి తాను మానవ రూపాన్ని వదిలి నాగదేవతగా పైలోకానికి వెళ్లిపోయానని తల్లిదండ్రులు నమ్మేలా సీన్ క్రియేట్ చేసింది.

ఇక రాత్రికి రాత్రే తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఉదయం లేచిన తల్లిదండ్రులు ఆ దృశ్యం చూసి మొదట నిజంగానే ఏదో జరిగిందని నమ్మారు. ఇరుగుపొరుగు సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. విచారణ తర్వాత ఇదంతా ఆ యువతి వేసిన నాటకమని బయటపడింది. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని, ఆమెను వెతకడం ప్రారంభించారు. ప్రేమ కోసం ఆమె చేసిన ఈ సినిమా స్టైల్ ప్లాన్ చూసి గ్రామస్తులే కాదు.. నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.

Next Story