ఒకరి ప్రేమ.. మరొకరికి చావు

by Web Desk |
ఒకరి ప్రేమ.. మరొకరికి చావు
X

దిశ, ఆత్మకూర్: మండలంలోని నిరుకుళ్ళ గ్రామానికి చెందిన ఒక ప్రేమ జంట వ్యవహారం లో ఓ యువకుడి ప్రమేయం ఉందని ఆ ప్రేమజంటలోని యువతి తల్లిదండ్రులు నుండి అతనికి హాని కలుగుతుందనే భయంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నీరుకుళ్ళ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. నీరుకుళ్ళ మృతుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. నీరుకుళ్ళ గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట ఊరు నుంచి పారిపోయారు. వారికి తన కొడుకు ముష్కే తరుణ్ సహకరించాడని యువతి తల్లిదండ్రులు గొడవ చేస్తారనే ఉద్దేశ్యంతో మహమ్మద్ గౌస్ పల్లి గ్రామానికి చెందిన బాబాయ్ ఇంటి వద్ద ఉంచారు.

కానీ నా కొడుకు మనస్తాపానికి గురై గత నెల 23వ తేదీన ఎలుకల మందు తాగాడు. చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించామని, అనంతరం మెరుగైన చికిత్స కోసం ములుగు రోడ్డులోని గార్డెన్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ తరుణ్ గురువారం మృతి చెందినట్లు తెలిపారు.



Next Story

Most Viewed