- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య.. అతడి వల్లే అంటూ కుటుంబ సభ్యుల ఆందోళన!
దిశ, కోడిమ్యాల: ఓ యువకుడికి కారణం లేకున్నా ఫెర్టిలైజర్ యజమాని పురుగుల మందు విక్రయించగా- latest Telugu news

దిశ, కోడిమ్యాల: ఓ యువకుడికి కారణం లేకున్నా ఫెర్టిలైజర్ యజమాని పురుగుల మందు విక్రయించగా ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోడీమ్యాల మండలం బొల్లెనిచెర్వు గ్రామానికి చెందిన అనుదీప్ అనే యువకుడు ఈ నెల 28న మండల కేంద్రంలోని కావేరి ఫెర్టిలైజర్ షాప్‌లో పురుగుల మందు కొనుగోలు చేసి ఆత్మహత్యాయత్నం చేసుకోగా గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 30వ తేదీన అనుదీప్ మృతి చెందాడు.
అనుదీప్ మృతికి ఎలాంటి కారణం లేకుండా పురుగుల మందు విక్రయించిన ఫెర్టిలైజర్ షాపు యజమానే కారణమంటూ అనుదీప్ కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో ఆ షాప్ ముందు ఆందోళన చేపట్టారు. షాప్ యజమాని పరారీలో ఉండడంతో తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలిసిన మల్యాల సీఐ రమణ మూర్తి ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. వాళ్లు మృతదేహం తీసేందుకు ససేమిరా అనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.






