యోగి వేమన పద్యాలు.. కేవలం పద్యాలు మాత్రమే కాదు: YS Jagan

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-19 08:02:58  IST  )

ఏపీ(Andhra Pradesh) మాజీ సీఎం, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

యోగి వేమన పద్యాలు.. కేవలం పద్యాలు మాత్రమే కాదు: YS Jagan
X

దిశ,వెబ్‌డెస్క్: వేమన జయంతిని పురస్కరించుకుని ఏపీ(Andhra Pradesh) మాజీ సీఎం, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యోగి వేమన పద్యాలు కేవలం పద్యాలు మాత్రమే కాదు అవి జీవిత సత్యాలు అని ఆయన పేర్కొన్నారు. మనిషి ఆత్మపరిశీలనకు, జీవన ప్రయాణానికి ఆ పద్యాలు వెలుగు రేఖలు అన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ వేమన రచించిన కొన్ని పద్యాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. “మేడిపండు చూడ మేలిమైయుండు”, “ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు”, “ఆత్మశుద్ధి లేని ఆచారమేల” అంటూ మనిషి మారితేనే సమాజం మారుతుందని శతాబ్దాల క్రితమే చెప్పిన వేమన జయంతి సందర్భంగా.. వైఎస్ జగన్(Former CM YS Jagan) ఆ మహనీయుడిని స్మరించుకుంటూ హృదయపూర్వక నివాళులర్పించారు.

Next Story