- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL.. ప్లేఆఫ్ లోకి ఢిల్లీ
WPL 2026 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు ప్లేఆఫ్స్‌కు చేరింది.

దిశ, వెబ్ డెస్క్ : WPL 2026 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు ప్లేఆఫ్స్‌కు చేరింది. యూపీ వారియర్స్‌తో నేడు జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత పొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులకే పరిమితమైంది. అనంతరం 123 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. వోల్వార్ట్ (47), షెఫాలీ వర్మ (29), జెమీమా రోడ్రిగ్స్ (34) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
ఈ విజయంతో ఢిల్లీ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. మంగళవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్, ఢిల్లీ తలపడనుండగా.. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆర్సీబీతో ఫైనల్‌లో తలపడనుంది. ఇక లీగ్ దశలోనే 12 పాయింట్లు సాధించి RCB డైరెక్ట్ గా ఫైనల్ కి చేరుకున్న సంగతి తెలిసిందే.






