- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఝార్ఖండ్‌లో బయటపడిన రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు
ఝార్ఖండ్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు బయటపడటం కలకలం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఝార్ఖండ్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు బయటపడటం కలకలం రేపుతోంది. తూర్పు సింగ్‌భూమ్ జిల్లా బహరాగోడా ప్రాంతంలో సువర్ణరేఖ నదీ తీరంలో ఇసుక తవ్వకాలు చేపడుతుండగా అనుకోకుండా వెలుగుచూసిన ఈ భారీ బాంబు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గ్యాస్ సిలిండర్ ఆకారంలో ఉండి, భారీ బరువుతో ఉన్న ఈ బాంబుపై ఉన్న గుర్తులను బట్టి ఇది అమెరికాలో తయారై (US-made) ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోలీసులు తక్షణమే అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని అటువైపు ఎవరూ వెళ్లకుండా భారీగా బలగాలను మోహరించారు.
ఈ బాంబును నిర్వీర్యం చేసేందుకు సమాచారం అందుకున్న రాంచీకి చెందిన 'బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్' (BDDS) ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. సాధారణంగా బీడీడీఎస్ బృందాలకు ఐఈడీలు (IEDs), చిన్న తరహా పేలుడు పదార్థాలను డీల్ చేయడంలో మాత్రమే అనుభవం ఉంటుంది. ఈ బాంబు పరిమాణం మరియు దాని స్వభావాన్ని బట్టి, సాధారణ పద్ధతుల్లో దీనిని నిర్వీర్యం చేయడం సాధ్యం కాదని ఆ బృందం స్పష్టం చేసింది. ఇది అత్యంత శక్తివంతమైనది, బరువైనది కావడంతో, దీనిని సురక్షితంగా డిస్పోజ్ చేయడానికి ఇండియన్ ఆర్మీ సహాయం అవసరమని బీడీడీఎస్ పేర్కొంది.
ప్రస్తుత పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఝార్ఖండ్ పోలీసులు ఉన్నతాధికారుల ద్వారా సైన్యానికి చెందిన స్పెషల్ బాంబు డిస్పోజల్ యూనిట్ సాయం కోరుతూ అధికారికంగా లేఖ రాశారు. కాగా ఒకటీ రెండు రోజుల్లో సైనిక నిపుణులు రంగంలోకి దిగి, ఆ బాంబు ఏ కాలానికి చెందినది? దానిని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి? అనే అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.






