వయసు కేవలం అంకెలు మాత్రమే.. 4 గంటల పాటు ప్లాంక్ చేసి 58 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు

by Malleboina Mahesh |

వయసు కేవలం అంకె మాత్రమే.. అంకితభావం ఉంటే ఏ వయసులోనైనా అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని కెనడాకు చెందిన డోనాజీన్ వైల్డ్ నిరూపించారు.

వయసు కేవలం అంకెలు మాత్రమే.. 4 గంటల పాటు ప్లాంక్ చేసి 58 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు
X

దిశ, వెబ్ డెస్క్: వయసు కేవలం అంకె మాత్రమే.. అంకితభావం ఉంటే ఏ వయసులోనైనా అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని కెనడాకు చెందిన డోనాజీన్ వైల్డ్ నిరూపించారు. వివరాల్లోకి వెళితే.. 58 ఏళ్ల వయసులో డోనాజీన్ వైల్డ్ ఏకంగా 4 గంటల 30 నిమిషాల 11 సెకన్ల పాటు ప్లాంక్ పొజిషన్‌లో ఉండి, మహిళల విభాగంలో అత్యంత సుదీర్ఘకాలం ప్లాంక్ చేసిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. గతంలో ఉన్న రికార్డును దాదాపు 10 నిమిషాల తేడాతో అధిగమించి ఆమె ఈ అద్భుత ఘనతను సొంతం చేసుకున్నారు. 12 ఏళ్ల క్రితం చేతి మణికట్టు విరగడం తో సాధారణ వ్యాయామాలు చేయలేక, ప్రత్యామ్నాయంగా ఆమె ప్లాంక్ చేయడం ప్రారంభించారు. ఈ రికార్డు కోసం ఆమె రోజుకు సుమారు 6 గంటల పాటు కఠినమైన శిక్షణ పొందడం విశేషం. ప్లాంక్ చేస్తూనే చదువుకోవడం, సినిమాలు చూడటం వంటి పనులు చేసే ఆమె, చివరి గంటలో మోచేతులు తీవ్రంగా నొప్పి పుట్టినప్పటికీ తన 12 మంది మనవళ్లు, మనవరాళ్ల ప్రోత్సాహంతో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఫిట్‌నెస్‌కు వయసుతో సంబంధం లేదని చాటిచెప్పిన ఆమెను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Next Story