- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో పొలాల బాట పట్టనున్న ఏఈవోలు.. ఎందుకంటే?
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రబీ సీజన్ నుంచి రాష్ట్రంలో వందశాతం పంటల డిజిటల్ సర్వే ప్రక్రియను వ్యవసాయ శాఖ వేగవంతం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రబీ సీజన్ నుంచి రాష్ట్రంలో వందశాతం పంటల డిజిటల్ సర్వే ప్రక్రియను వ్యవసాయ శాఖ వేగవంతం చేసింది. 45 రోజుల్లో పూర్తి చేయాలని ఏఈవోలకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో 10,621 గ్రామాలు ఉండగా, వాటిలో 2,342 ఏఈవోలు ఉన్నారు. వారికి తోడుగా ప్రైవేట్ సర్వేయర్లు కూడా పొలాలకు వెళ్లి 1.50 కోట్ల ఎకరాలను సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రైతులకు సంక్షేమ పథకాలను అమలు చేయనున్నారు.
రైతులు సహకరిస్తే అనుకున్న సమయంలో సర్వే పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో ఇందుకు 90 రోజుల సమయం పడుతుంది. ప్రైవేట్ సిబ్బందిని నియమిస్తే కేంద్రం ఆదేశించిన కాలంలో సర్వే రిపోర్టు ఇవ్వొచ్చు. అధికారులు తప్పనిసరిగా సంబంధిత సర్వే నంబర్‌కి వెళ్లి అక్కడ సాగులో ఉన్న పంట ఫొటోలు తీయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కష్టమైన పని కావడంతో కేంద్ర ప్రభుత్వం సర్వేకు అవసరమైనంత మంది స్థానిక యువకులు, రైతులు, ప్రైవేటు సర్వేయర్లను నియమించుకుని పూర్తి చేయాలని పేర్కొన్నది.
9,795 గ్రామాల్లో డిజిటల్ సర్వే..
వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సర్వే విస్తీర్ణం పరిధిని పురుష అధికారులకు 2 వేల ఎకరాలు, మహిళా అధికారులకు 1800 ఎకరాలుగా కుదించడంతో ఏఈవోలు గత రెండు సీజన్లలో డిజిటల్ సర్వే చేపట్టారు. ఈసారిఅందుబాటులో ఉన్న 2,342 మంది ఏఈవోలతో పాటు మిగతా 8,279 మంది ప్రైవేటు సర్వేయర్లను నియమించి సాగు భూముల సర్వే చేపట్టడానికి ప్రభుత్వం ప్లాన్చేస్తోంది. ఇందుకు కోసం విడుదల చేసిన రూ. 15.21 కోట్ల నిధుల్లో వర్షాకాలం సీజన్‌కు రూ. 2.93 కోట్లు ఖర్చు చేయగా మిగిలిన రూ. 12.28 కోట్లను ఇప్పుడు వినియోగించనుంది.
రాష్ట్రంలో 10,621 గ్రామాలు ఉండగా ప్రభుత్వం జియో సర్వే కోసం 9,795 గ్రామాలకు సిపారసు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 70 లక్షల మంది పట్టాదారు పాసు బుక్కలిగిన రైతులు ఉంటే సర్వే నెంబర్లు 194.69 లక్షలు ఉన్నాయి. వాటిలో 174.36 లక్షల నెంబర్ల మాత్రమే పంట సర్వే చేసేందుకు అనువుగా ఉన్నాయి. మిగతా 20 లక్షల సర్వే నంబర్ల భూములకు సంబంధించిన మ్యాపులు ఇప్పటివరకు లేకపోవడం గమనార్హం.
ఏపీలో ప్రత్యేక వ్యవస్థ..
ఏపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖలో గ్రామస్థాయిలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నియామకం చేపట్టి 7 ఏళ్ల క్రితమే ‘ఈ -పంట సర్వే’ పేరుతో పంటల సాగును క్షుణ్ణంగా సర్వే చేసే ప్రక్రియను మొదలు పెట్టింది. ఆహార భద్రత, ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్యం, పంటల ఇన్సూరెన్స్, కొనుగోలు తదితర ప్రణాళికలకు రైతులు సాగు చేస్తున్న సాగు విస్తీర్ణం, పంటల దిగుబడుల ఖచ్చితమైన అంచనా వివరాలు ప్రభుత్వాలకు కీలకంగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో గ్రామస్థాయి వ్యవసాయ సహాయకుల లోటును ఆదర్శ రైతుల నియామకం ద్వారా భర్తీ చేయాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తద్వారా వంద శాతం ఖచ్చితత్వంతో సర్వే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఆదర్శ రైతుల సంఘం అధ్యక్షుడు లింగయ్య యాదవ్ పలు సందర్భాల్లో తెలిపారు. పంటల సాగు సర్వేను పకడ్బందీగా చేసి రైతులకు పంట రుణాలు, ఫసల్ బీమా, పంటల కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.






