- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ ఢీకొని మహిళ మృతి
by Jakkula.Mamatha |
వెల్గటూర్ ఉమ్మడి మండలంలోని రాజారాంపల్లి సర్కిల్ వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందారు.

X
దిశ, వెల్గటూర్: వెల్గటూర్ ఉమ్మడి మండలంలోని రాజారాంపల్లి సర్కిల్ వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందారు. చర్లపల్లి గ్రామానికి చెందిన పత్తిపాక మునిలత అనే వికలాంగురాలైన మహిళా కేవైసీ చేయించుకోవడానికి రాజారాంపల్లి గ్రామానికి ఆటోలో చేరుకొని రాజారాంపల్లి సర్కిల్‌లో దిగింది. అనంతరం మీ సేవకు వెళ్ళడానికి స్టేట్ హైవే క్రాస్ చేస్తున్న సమయంలో జగిత్యాల నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీ పత్తిపాక మునిలత అనే మహిళను ఢీకొట్టగా తీవ్రంగా గాయపడి.. రోడ్డు పై కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్న మహిళను గమనించిన స్థానికులు తక్షణమే అంబులెన్స్‌లో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.
Next Story






