హిజాబ్‌ను తాకితే చేతులు నరికేస్తాం: ఎస్పీ నేత రుబీనా ఖనం

by Yarlagadda Naga Rani |

హిజాబ్‌ను తాకితే చేతులు నరికేస్తాం: ఎస్పీ నేత రుబీనా ఖనం
X

లక్నో: కర్ణాటక హిజాబ్ వివాదం నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ నేత రుబీనా ఖనం సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్‌ను ముట్టుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారి చేతులు నరికేస్తామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లో అలీగఢ్‌లో శనివారం రుబీనా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. 'మీరు భారత కూతుళ్లు, సోదరీమణుల గౌరవం పట్ల ఆడుకోవడానికి ప్రయత్నిస్తే, వారు ఝాన్సీ లక్ష్మీభాయి, రజియా సుల్తానాలు‌గా మారుతారు. ఒకవేళ హిజాబ్‌ను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీ చేతులు తెంపడానికి ఎంతో సమయం పట్టదు' అని అన్నారు. భారతదేశం భిన్నత్వం గల దేశమని, ఒక వ్యక్తి నుదుటిపై తిలకం కలిగి ఉన్నాడా లేదా తలపాగా లేదా హిజాబ్ ధరించాడా అనేది పట్టింపు లేదని పేర్కొన్నారు. ఇవన్నీ భారత సంప్రదాయంలో భాగమని, అనవసరంగా రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపించినా మహిళలను బలహీనంగా భావించొద్దని చెప్పారు.

Next Story