- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్తను సుత్తితో కొట్టి చంపిన భార్య
భార్య భర్తలు తరచూ గొడవ పడుతూ, మాట మాట పెరగడంతో కోపోద్రేకానికిలోనై భార్య తన భర్తను సుత్తితో తలపై కొట్టి చంపిన ఘటన గుండాలలో చోటు చేసుకుంది.

దిశ,గుండాల: భార్య భర్తలు తరచూ గొడవ పడుతూ, మాట మాట పెరగడంతో కోపోద్రేకానికిలోనై భార్య తన భర్తను సుత్తితో తలపై కొట్టి చంపిన ఘటన గుండాలలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల గ్రామానికి చెందిన మాదరబోయిన బిక్షం(64) భార్య ఉప్పలమ్మ(57) ఇద్దరు కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వారిద్దరూ తరచూ గొడవలు పడేవారని ఆదివారం తెల్లవారుజామున రెండున్నర సమయాన గృహ తగాదాల వల్ల ఇద్దరు గొడవ పడ్డారు.
ఆ గొడవ కాస్త పెరగడంతో మాట మాట పెరిగి ఆవేశానికి లోనైన భార్య పక్కనే ఉన్న సుత్తి తీసుకుని భర్త తలపై కొట్టడంతో ఒక్కసారిగా అతను అపస్మారక స్థితిలో జారుకుని రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి యాదాద్రి డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, యాదగిరిగుట్ట రూరల్ సిఐ శంకర్ గౌడ్, ఎస్ఐ తేజంరెడ్డి సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






