Alcohol: అమ్మాయిలు మందు తాగినాక ఏం చేయాలని అనుకుంటారు..?

by Anjali |
Alcohol: అమ్మాయిలు మందు తాగినాక ఏం చేయాలని అనుకుంటారు..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో కొంతమంది మగవాళ్లు ఆల్కహాల్‌(alcohol)కు ఏ విధంగా బానిస అవుతున్నారో చెప్పాల్సిన అక్కర్లేదు. కొంతమంది మందు తాగి సైలెంట్‌గా ఉంటే.. మరికొంతమంది రోడ్లపై, ఇళ్లలో గొడవలు చేస్తుంటారు. నోటికి వచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడుతారు.

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఆల్కహాలు కాలేయం(liver), గుండె (heart), మెదడు(brain)కు హాని చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. అంతే కాకుండా ఆల్కహాల్ వ్యసనం వల్ల వ్యక్తిగత, సామాజిక సంబంధాలు(Social relations) కూడా దెబ్బతింటాయి.

ఇతర ఆరోగ్య సమస్యలతోపాటు కాలేయ వ్యాధి, అధిక రక్తపోటు(blood pressure), వివిధ క్యాన్సర్‌(Cancer)లు, పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యాలు (పుట్టుకలో శిశువును ప్రభావితం చేసే సమస్యలు) వంటి వాటికి దారితీయవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు కూడా ఆల్కహాల్ సేవిస్తోన్న విషయం తెలిసిందే.

ఆడవాళ్లు ఆల్కహాల్ తీసుకోవడం ప్రెజెంట్ డేస్‌లో ఫ్యాషన్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ మద్యం తాగితే నష్టాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మహిళలు మద్యం తాగితే టైప్ 2 డయాబెటీస్(Type 2 diabetes) వచ్చే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. అంతేకాకుండా మితంగా ఆల్కహాల్ తీసుకుంట అల్జీమ్స్ వ్యాధి(Alzheimer's disease) తలెత్తుతుందట. కానీ ఆందోళన, ఒత్తిడి(stress), తగ్గుతుందని అంటున్నారు. అంతేకాకుండా మంచి నిద్రకు కూడా దారితీస్తుంది.

వీటితో పాటుగా మహిళల్లో ఎముకల సాంద్రత కూడా పెరుగుతుందని చెబుతున్నారు కానీ.. మహిళలు మద్యం తాగినాక ఏం చేయాలనుకుంటారో తెలుసా..? మహిళలు మద్యం తాగినాక ఎక్కువగా డ్యాన్స్ (Dance) చేయాలని అనుకుంటార. అలాగే పక్కనున్న వారితో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడుతారట. మనసులోని బాధను మొత్తం వెల్లగక్కుతారని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.

Next Story

Most Viewed