తప్పుల తడకగా ఓటర్ల జాబితా.. లిస్టులో మాజీ కలెక్టర్ పేరు

by Muthe.Rajitha |

రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాను ప్రకటిచింది తెలంగాణ ఎన్నికల సంఘం.

తప్పుల తడకగా ఓటర్ల జాబితా.. లిస్టులో మాజీ కలెక్టర్ పేరు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాను ప్రకటిచింది తెలంగాణ ఎన్నికల సంఘం. కాగా ఈ లిస్టులో అనేక తప్పులున్నట్టు కమిషన్ కు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ లో విధులు నిర్వహిస్తున్న మాజీ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆమె తండ్రి పిఎన్ త్రిపాఠీల పేర్లు ఆమె గతంలో విధులు నిర్వహించిన ములుగు జిల్లా లిస్టులోనే ఉన్నాయి. సాక్షాత్తు మాజీ కలెక్టర్ పేరే తొలగించని అధికారులు, సామాన్య ప్రజల విషయంలో ఇంకెంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల చనిపోయిన వారి పేర్లు కూడా తీయకపోవడంపై ప్రజలు అధికారుల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు.

Next Story